SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రి కోర్టు నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ నిర్మల

మందమర్రిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న  కోర్టు భవనాన్ని జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ (డి.ఎల్.ఎస్.ఏ) చైర్మన్ నిర్మల సందర్శించారు. ఈ సందర్భంగా భవనంలోని వివిధ విభాగాలను పరిశీలించి, ప్రారంభానికి ముందుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.అలానే న్యాయవాదులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య, సీనియర్ న్యాయవాదులు సందని, సుంకర భుజంగరావు, మేకల రాజన్న, ఆర్.ఆర్. రాములు, సత్తన్న, మధుకర్, శేఖర్, ఆంజనేయులు, సదయ్య, రమణ, కిన్నెర్ల శ్రీనివాస్, రంజిత్ గౌడ్, కట్ల శ్రీనివాస్, అయిల్లా లక్ష్మణ్‌తో పాటు మండలానికి చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

సింగరేణి పరిరక్షణ సదస్సు: హరీష్ రావుకు గజమాలతో ఘన స్వాగతం పలికిన బాల్క సుమన్..

siti news telangana

లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హామీ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

siti news telangana

రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత : పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్

siti news telangana