SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

సింగరేణి పరిరక్షణ సదస్సు: హరీష్ రావుకు గజమాలతో ఘన స్వాగతం పలికిన బాల్క సుమన్..

సింగరేణి పరిరక్షణ సదస్సు కు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు…

సింగరేణి సమస్త పరిరక్షణకై ప్రతి ఒక్కరు నడుంబించాలని బిఆర్ఎస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు.హరీష్ రావు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సుకు విచ్చేసిన హరీష్ రావుకు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, యూనియన్ నాయకులు పుష్పగుచ్చాలని అందిస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సదస్సులో హరీష్ రావు ప్రత్యేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కూలక్షంగా వివరించారు.అలానే సింగరేణి సంస్థకు జరుగుతున్న నష్టాలు, ప్రైవేటీకరణము ముప్పు,కార్మికుల హక్కులను కాలరాసే విధానాలపై చర్చించారు. అదేవిధంగా సింగరేణిని కాపాడుకోవడానికి కార్మిక లోకం ఏ విధంగా చైతన్యవంతం కావాలనే విషయాలపై దిశా నిర్దేశం చేశారు.సింగరేణి తెలంగాణ గుండెకాయ లాంటిదని దీనిని ప్రభుత్వం రంగంగానే ఉంచుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Related posts

మందమర్రిలో 300 గజాలకుపైగా స్థలాలు కలిగిన భవనాలకు వర్షపు నీటి సంరక్షణ గుంతలు తప్పనిసరి..

siti news telangana

ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం లో దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు

siti news telangana

విజయవంతంగా ముగిసిన పెన్ కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ పోటీలు

siti news telangana