SITI NEWS TELANGANA
తెలంగాణ

సీఎస్‌ను కలిసిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు

సీఎస్‌ను కలిసిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వినతి… 

తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ ( టి.ఎస్.జె.యూ ) మంచిర్యాల జిల్లా అధ్యక్ష రాజు పటేల్, ప్రధాన కార్యదర్శి కల్వల అరుణ్ కుమార్.అరుణ్ కుమార్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సి.ఎస్ ) సంజయ్ జజూ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.

జర్నలిస్టుల ప్రతినిధులు తెలిపిన సమస్యల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని పేర్కొంటూ, ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ఇతర ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఎన్‌హెచ్-63 నాలుగు లేన్ల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

siti news telangana

పేదింటి ఆత్మగౌరవానికి చిరునామా ఇందిరమ్మ ఇల్లు : గృహ నిర్మాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

siti news telangana

సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్-2 కేటాయింపు: హర్షం వ్యక్తం చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ