SITI NEWS TELANGANA
తెలంగాణ

సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్-2 కేటాయింపు: హర్షం వ్యక్తం చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

‘తాడిచర్ల కోల్ బ్లాక్-2’ను సింగరేణి కాలరీస్‌కు కేటాయించడం పట్ల ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణకే తలమానికమైన సింగరేణి హక్కుల సాధన కోసం చేసిన పోరాటానికి ఈ నిర్ణయంతో సరైన ఫలితం దక్కిందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం, సంస్థ హక్కుల కోసం ఎప్పటికప్పుడు తాము చేసిన రాజీలేని పోరాటమే ఈ కేటాయింపునకు దారితీసిందని అన్నారు. అలాగే తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడుకోవడం అందరి బాధ్యత అని, తాడిచర్ల బ్లాక్-2 కేటాయింపుతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అలానే తెలంగాణ ప్రజల, సింగరేణి కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సింగరేణి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు.తాడిచర్ల కోల్ బ్లాక్ కేటాయింపుతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరగడమే కాకుండా, వేలాది మంది కార్మికులకు ఉపాధి భద్రత లభిస్తుందని స్థానిక నాయకులు, కార్మిక  సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి అని పెరుకొన్నారు.

Related posts

పేదింటి ఆత్మగౌరవానికి చిరునామా ఇందిరమ్మ ఇల్లు : గృహ నిర్మాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

siti news telangana

ఎన్‌హెచ్-63 నాలుగు లేన్ల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

siti news telangana

ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి మల్లు భట్టి విక్రమార్క

siti news telangana