SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అనర్హులా ? : బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో భారీ ఎత్తున అనర్హులకు చోటు..

మందమర్రి :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో భారీ ఎత్తున అనర్హులకు చోటు దక్కిందని స్థానిక బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మందమర్రి ప్రెస్ క్లబ్‌లో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లడుతూ అధికారులు విడుదల చేసిన జాబితాలో నిజమైన పేదలకు కాకుండా, అనర్హులకు అలనే పైరవీకారులకే ఇళ్లు కేటాయించారని వారు ఆరోపించారు. ఏళ్ల తరబడి సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో మగ్గుతున్న ఎంతో మంది అర్హులైన నిరుపేదలను అధికారులు విస్మరించడం దారుణమన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఏకపక్షంగా జాబితాను రూపొందించారని మండిపడ్డారు.అదేవిధంగా తక్షణమే ఈ లబ్ధిదారుల జాబితాను నిలిపివేసి, రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అలనే అనర్హులను తొలగించి వారి స్థానంలో అర్హులకు న్యాయం చేయాలని కోరారు.అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దక్కే వరకు బీఆర్ఎస్ పక్షాన పోరాడుతామని, ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో బండారు.సూరిబాబు, ఎండి.అబ్బాస్, కొంగల.తిరుపతిరెడ్డి, ఓ.రాజశేఖర్, బత్తుల.శ్రీనివాస్, తోట.సురేందర్,పల్లె.నర్సింలు, రామచందర్, రాజనర్సు, సాగర్, సురేందర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల జాబితాపై బీఆర్‌ఎస్ నాయకుల తీరును ఖండించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద.తిరుమల్ రెడ్డి

siti news telangana

సి.ఎం.ఓ.ఏ.ఐ ఆధ్వర్యంలో అధికారుల రెండవ రోజు రిలే నిరాహార దీక్ష : మందమర్రి ఏరియా

siti news telangana

ప్రజల దాహార్తిని తీర్చిన ప్రజా నాయకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు : పొన్నారం గ్రామ ప్రజలు..

siti news telangana