SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

సి.ఎం.ఓ.ఏ.ఐ ఆధ్వర్యంలో అధికారుల రెండవ రోజు రిలే నిరాహార దీక్ష : మందమర్రి ఏరియా

రెండో రోజుకు చేరిన అధికారుల రిలే నిరాహార దీక్షలు…

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా జిఎం కార్యాలయ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు ఉత్సాహంగా ప్రారంభమైన ఈ దీక్షలు, రెండో రోజు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా అద్యేక్షులు రమేష్ మాట్లడుతూ రెండవ రోజు దీక్షా శిబిరానికి ఎ.ఐ.టి.యు.సి అద్యేక్షులు వాసిరెడ్డి.సీతరామయ్య, టి.బి.జి.కే.ఎస్ నాయకులూ మిరియాల.రాజ్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు,సంఘం ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో అధికారులు సిబ్బంది తరలివచి దీక్షలో కూర్చున్న వారికి తమ సంఘీభావాన్ని ప్రకటించారని తెలిపారు.అదే విధంగా యాజమాన్యం అలనే ప్రభుత్వం తమ డిమాండ్లపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇప్పటికైనా స్పందించకపోతే ఈ నిరసనలను మరింత తీవ్రం చేస్తామని, అవసరమైతే విధులను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం దీక్షా శిబిరం వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు శాంతియుతంగా, ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు.

Related posts

వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసేందుకు ముగ్గు చూపాలి

siti news telangana

అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి : మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

siti news telangana

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం : జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

siti news telangana