SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల జాబితాపై బీఆర్‌ఎస్ నాయకుల తీరును ఖండించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద.తిరుమల్ రెడ్డి

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల జాబితా లో అర్హులు.. బీఆర్‌ఎస్ నాయకుల తీరు తీరును ఖండించిన కాంగ్రెస్ … 

మందమర్రి :
అర్హులైన పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల జాబితాపై బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు,చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని కాంగ్రెస్ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.శనివారం మందమర్రి ప్రెస్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లడుతూగత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో విఫలం అయిన బీఆర్‌ఎస్ నాయకుల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నిరాధారమైన, బాధ్యతారహితమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేలా చూస్తామని, బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలను  ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల.నర్సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు.లక్ష్మణ్, మాజీ పట్టణ అధ్యక్షులు నోముల.ఉపేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు ఎండి.పాషా, ఉపాధ్యక్షులు బేర.వేణుగోపాల్, గణేష్,వనం.నరసయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు. రమేష్, సట్ల.సంతోష్, చిప్పకుర్తి శశిధర్, రాయబారపు కిరణ్,కుందే.రామకృష్ణ, కొకుల.మధు, సోమరపు.శామ్యూల్,వేల్పుల.కిరణ్, గడ్డం.రజిని, కవిత తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ప్రజాస్వామ్యానికి ఓటే బలం: పెద్దపల్లి ఎంపీ గడ్డం.వంశీకృష్ణ

siti news telangana

నకిలీ పత్తి విత్తనాల రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్ సీజ్

siti news telangana

సేవా కార్యక్రమాల రూపంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు : రామకృష్ణాపూర్‌ కాంగ్రెస్ శ్రేణులు

siti news telangana