SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

24వ త్రైపాక్షిక సేఫ్టీ సమీక్ష సమావేశం : మందమర్రి ఏరియా.

ప్రమాద రహిత సింగరేణి సాధనకు కృషి.. త్రైపాక్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు..

మందమర్రి :
సింగరేణి కాలరీస్ సంస్థ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల 24వ త్రైపాక్షిక సేఫ్టీ (రక్షణ) సమీక్ష సమావేశం మందమర్రిలోని ఇల్లందు క్లబ్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు,డీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్,జీఎం సేఫ్టీ సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై, సమావేశాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లడుతూ కార్మికుల ప్రాణ రక్షణే సంస్థకు అత్యంత ముఖ్యమైనదని, బొగ్గు ఉత్పత్తితో పాటు సేఫ్టీ నిబంధనలను నూరు శాతం పాటించాలని డైరెక్టర్ స్పష్టం చేశారు.అలనే గనుల్లో జరిగే చిన్నపాటి పొరపాట్లను కూడా విస్మరించకూడదని, “ప్రమాద రహిత సింగరేణి” సాధనకు యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పని చేయాలని,రక్షణ ప్రమాణాలను మెరుగుపరచడానికి గనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు.అలాగే కార్మికులకు పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.తడనతరం గనుల్లో పని చేసే కార్మికుల భద్రత, ప్రమాదాల నివారణ, సురక్షిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశంలో డీడీఎంఎస్ (మైనింగ్) దీపక్ కుమార్ ప్రభాకర్, డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) కోమల్ చౌదరి మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం.రమేష్, మందమర్రి ఏరియా ఎఐటియుసి గుర్తింపు సంఘ బ్రాంచి సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, గోలేటి ఏరియా ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఎస్.తిరుపతి, బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టీ రఘు కుమార్, జీఎం (రెస్క్యూ) శ్రీనివాస్ రెడ్డి (మందమర్రి) సిఎంఓఎఐ అద్యేక్షులు ఎస్.రమేష్, (బెల్లంపల్లి)సిఎంఓఎఐ అద్యేక్షులు నరేందర్, ఏరియా ఏజెంట్లు, గని మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులు, సేఫ్టీ ఆఫీసర్లు,యూనియన్ ప్రతినిధులు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, పెద్ద సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

siti news telangana

మందమర్రి సింగరేణి యోగ హాల్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

siti news telangana

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండించిన : రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల.శ్రీనివాస్

siti news telangana