SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండించిన : రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల.శ్రీనివాస్

కాంగ్రెస్ ప్రభుత్వనికి వస్తున్న ప్రజ ఆదరణను తట్టుకోలేకనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు… 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలలో రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకనే మతిస్థిమితం కోల్పోయి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతున్నారని  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి.రఘునాథ్ రెడ్డి ,రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల.శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చంచల్ గూడ జైలు నుండి బెయిల్ విడుదలైన బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు బాల్క సుమన్ కి లేదన్నారు, సింగరేణి సంస్థను బలహీనపరిచినది, ఉద్యోగాలను తగ్గించినది,భూగర్భ గనులను మూసివేసి ఓపెన్‌కాస్ట్ గనులను పెంచినది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు.

2018 , ఫిబ్రవరి 22న శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జరిగిన సభ కోసం బెల్లంపల్లి నుంచి ఆర్జీ-3 వరకు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసి, దాదాపు 20 వేల మంది కార్మికులకు సెలవులు ఇచ్చి బస్సుల్లో తరలించడం నిజం కాదా, జీఎం స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు బస్సులకు కండక్టర్లు, క్లీనర్లుగా పనిచేసిన పరిస్థితి ఏర్పడలేదా అని ప్రశ్నించారు.ఆ సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు కొత్త గనులు ప్రారంభిస్తామని ప్రకటించి కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎన్ని కొత్త భూగర్భ గనులు ప్రారంభించారో ప్రజలకు చెప్పాలన్నారు. పదివేల కొత్త క్వార్టర్లు నిర్మిస్తామని,పదివేల ఉద్యోగాలు ఇస్తామని, మారుపేర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని దుయ్యబట్టారు.ఓపెన్‌కాస్ట్ గనులకు వ్యతిరేకమని చెప్పిన కేసీఆర్, హరీష్ రావులు అధికారంలోకి వచ్చాక సింగరేణిని ఓపెన్‌కాస్ట్ గనుల కేంద్రంగా మార్చలేదా అని ఎద్దేవా చేశారు. ‘’లంచం అడిగితే చెప్పుతో కొట్టండి” అన్న కేసీఆర్, మెడికల్ బోర్డుల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై బాల్క సుమన్ ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలన్నారు.బొగ్గు గనుల రంగంలో ప్రైవేటీకరణకు సంబంధించిన చట్ట సవరణలకు అప్పటి ఎంపీగా బాల్క సుమన్ మద్దతు తెలిపారనే ఆరోపణలకు సమాధానం ఇవ్వాలన్నారు.

చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు వివేక్ వెంకటస్వామి ఎంతగానో పాటుపడుతున్నారని పేర్కొన్నారు.వివేక్ వెంకటస్వామి మంత్రిగా ఎన్నికైన నాటి నుండి కార్మిక, అసంఘటిత కార్మిక, కర్షక, నిరుద్యోగుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను బలోపేతం చేయడానికి, ప్రజల, కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.కారుణ్య నియామకాలు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమానికి సంబంధించిన సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్మికులను రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు ప్రేరేపించడం కాకుండా, వారి సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలని బాల్క సుమన్‌కు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భీమ మల్లేష్, పట్టణ ఉపాధ్యక్షులు కాసర్ల ప్రకాష్, బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు గోపు రాజం, మేకల సురేందర్,ఏల్పుల సత్యనారాయణ, అధికార ప్రతినిధి మొట్టె సుధాకర్, కార్యదర్శులు పైడాకుల శ్రీనివాస్, వెనిగల శ్రీనివాస్, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జిఎం కార్యాలయం ఎదుట అధికారుల రిలే నిరాహార దీక్షలు : మందమర్రి ఏరియా

siti news telangana

ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్ వివేక్ వెంకటస్వామి , ఎంపీ వంశీకృష్ణ

siti news telangana

హోరాహోరీగా మందమర్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు: అధ్యక్షుడిగా జి. రామచందర్ ఘన విజయం

siti news telangana