SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హామీ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీని సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను సానుకూలంగా స్పందించిన ఎంపీ , వెంటనే వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఇందులో భాగంగా విద్యార్థులకు అవసరమైన వాష్‌రూమ్‌లు , తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయగా, ఈరోజు వాటి పనితీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

అనతరం ఎంపీ మాట్లాడుతూ, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు, అదేవిధంగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ లో పోస్టులను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు.అలనే విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

Related posts

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

siti news telangana

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అనర్హులా ? : బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

బిఎల్ఎ -2(బూత్ లెవెల్ ఏజెంట్) సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నా మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి

siti news telangana