SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ప్రజల దాహార్తిని తీర్చిన ప్రజా నాయకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు : పొన్నారం గ్రామ ప్రజలు..

నూతన బోర్ వెల్‌ నిర్మాణ పనులను ప్రారంభించన సర్పంచ్ మధు.. 

మందమర్రి మండల పొన్నారం గ్రామాల్లోని ప్రజల తాగునీటి ఇబ్బందులను తొలగించడమే ధ్యేయంగా మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి, ఎంపి గడ్డం.వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో స్థానిక 2,3వ వార్డులలో ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం మంజూరైన నూతన బోర్ వెల్‌ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందిని గ్రామ సర్పంచ్ పెంచల.మధు పెరుకొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సాధారణ రోజుల్లో కూడా 2, 3వ వార్డుల ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను మంత్రి వివేక్, ఎంపీ వంశీల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించిన వారు, బోర్ వెల్స్ మంజూరుకు నిధులు కేటాయించి చొరవ చూపడంపై గ్రామస్తుల తరపున సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం అని, ఈ బోర్ వెల్ ఏర్పాటుతో 2, 3వ వార్డుల పరిధిలోని కాలనీ వాసులకు తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంచాల.అమృత, వార్డ్ సభ్యులు మేకల.వంశీ , సూరిమిల్లా.పద్మ శ్రీనివాస్,బోర్లకుంట.లక్ష్మణ్,బొజ్జ.రాజకుమారి, మండల అధ్యక్షుడు కడారి.జీవన్ కుమార్,ఆదిల్ పేట గ్రామ సర్పంచ్ నెండుగురి.పున్నం,మండల ఉప అధ్యక్షులు మాస్.సంతోష్, నాయకులు నాయకులు పెంచాల.రాయలింగు,పొక్కూరి.సమ్మయ్య, నీలం.ఆనంద్,బొజ్జ. రాములు,వేల్పుల.రాజారాం, గోస్కే.వినయ్, నర్సిగోజు. తిరుపతి, కొట్టే.సంపత్, గ్రామ వివో అధ్యక్షురాలు గోగు.సుమలత, తిరుమల,తదితరులు పాల్గొన్నారు.

Related posts

24వ త్రైపాక్షిక సేఫ్టీ సమీక్ష సమావేశం : మందమర్రి ఏరియా.

siti news telangana

వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసేందుకు ముగ్గు చూపాలి

siti news telangana

మనోవికాస్ పాఠశాలలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు : కాంగ్రెస్ శ్రేణులు

siti news telangana