SITI NEWS TELANGANA
క్రైమ్ బ్రేకింగ్ న్యూస్

ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో 3డీ యానిమేటెడ్ పోలీసు పెట్రోలింగ్ వాహన నమూనాల ఏర్పాటు : సుల్తానాబాద్‌

రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న చర్య…

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు అధికంగా జరిగే నారాయణపూర్ క్రాస్‌రోడ్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ సమీపంలోని కాట్నపల్లి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న చర్యగా సుల్తానాబాద్ పోలీసులు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌రావు, ఎస్‌ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో 3డీ యానిమేటెడ్ పోలీసు పెట్రోలింగ్ వాహన నమూనాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇటువంటి 3డీ యానిమేటెడ్ నమూనాలను పలు దేశాల్లో కూడా విజయవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.అతివేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొంటూ, ప్రమాదాలను నివారించడంతో పాటు అతివేగాన్ని నియంత్రించేందుకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఈ తరహా 3డీ యానిమేటెడ్ పోలీసు పెట్రోలింగ్ వాహన నమూనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజీవ్ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, అతివేగంగా లేదా మద్యం మత్తులో వాహనాలు నడిపే వాహనదారులు దూరం నుంచే ఈ 3డీ యానిమేటెడ్ పోలీసు పెట్రోలింగ్ వాహన నమూనాలను గమనించి వాహన వేగాన్ని తగ్గించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రాత్రి సమయంలో కూడా ఈ నమూనాలు స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లను అమర్చినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.

Related posts

జీతాలు అడిగితే తన్నులా? – మందమర్రి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ సూపర్వైజర్ గుండాయిజం

siti news telangana

మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత : ముగ్గురు నిందితుల అరెస్ట్

siti news telangana

గోవాలో ఘోర పడవ ప్రమాదం: 23 మంది మృతి, 64 మంది గల్లంతు.

siti news telangana