SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రిలో 300 గజాలకుపైగా స్థలాలు కలిగిన భవనాలకు వర్షపు నీటి సంరక్షణ గుంతలు తప్పనిసరి..

నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు తప్పనిసరి…

మందమర్రి,
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “జల్ సంచయ్ – జల్ భాగీధారి” కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు వర్షపు నీటి సంరక్షణ చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజలింగు సూచించారు.

 మునిసిపాలిటీ పరిధలో 300 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ స్థల విస్తీర్ణం కలిగిన గృహ యజమానులు, అలాగే వాణిజ్య సముదాయాల యజమానులు తమ భవన ఆవరణలో వర్షపు నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) తప్పనిసరిగా నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు.వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరతను తగ్గించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు.అర్హులైన గృహ యజమానులు, వాణిజ్య సముదాయాల యజమానులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా వర్షపు నీటి  సంరక్షణ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి జల సంరక్షణ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

Related posts

గనుల , డిపార్ట్మెంట్ ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా : ఎఐటియుసి యూనియన్

siti news telangana

జైపూర్ మండలంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమ మట్టి దందా

siti news telangana

మందమర్రి సింగరేణి పాఠశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

siti news telangana